ఒక యోగి ఆత్మకథ
Author: పరమహంస యోగానంద
Subject: Paramahansa; Yoga; Yogananda; Yogi; Yogoda; YSS; autobiography; saints; Satsanga; Spiritual; Spirituality; Meditation; self-realization; Guru; SRF
Publisher: Yogoda Satsanga Society of India (2019-11-01)
978-93-83203-57-4
ఈ ఆత్మకథ ఏకకాలంలో ఒక పరిశీలన, ఒక పదచిత్రణ. మానవ అస్తిత్వపు అంతిమ మర్మాలను, మరిచిపోలేని రీతిలో నిశితంగా పరిశీలించే, బహుళాదరణ పొందిన ఈ ఆత్మకథ, మన కాలపు ఆధ్యాత్మిక మహాపురుషుల్లో ఒకరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వచిత్రణ కూడా. పరమహంస యోగానందగారు ఆకట్టుకునే నిజాయితీతోనూ ధారాళమైన వాక్పటిమతోనూ హాస్యయుతంగానూ ఉత్తేజకరమైన తమ జీవిత కథని చెబుతారు. అద్భుతమైన ఆయన బాల్యానుభవాలూ జ్ఞాని అయిన ఒక గురువుకోసం యవ్వనంలో ఆయన చేసిన అన్వేషణలో తారసపడిన అనేకమంది సాధుసంతులతో అనుభవాలూ దైవసాక్షాత్కారం పొందిన గురుదేవుల ఆశ్రమంలో పది సంవత్సరాలు సాగిన శిక్షణా ప్రపంచ వ్యాప్తంగా సత్యాన్వేషకులకి బోధచేస్తూ గురువుగా ఆయన గడిపిన అనేక సంవత్సరాల కాలం అన్నీ ఇందులో వివరించారు. రమణ మహర్షి, ఆనందమయి మాత, మాస్టర్ మహాశయ (రామకృష్ణ పరమహంస శిష్యులూ సాధుశీలి), మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ టాగూర్, జగదీశ్ చంద్ర బోసులతో ఆయన సమాగమ వివరాలు కూడా ఇందులో పొందుపరచి ఉన్నాయి.
ఆధునిక ఆధ్యాత్మిక గ్రంథరాజంగా ప్రశంసలు పొందిన ఈ పుస్తకం 50 భాషల్లోకి అనువదించబడింది. అనేక కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథంగా, పఠనీయ గ్రంథంగా విస్తృతంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఒక జీవిత కాలపు మనోహరమైన గ్రంథ పఠనానుభవంగా ఒక యోగి ఆత్మకథను వేలాది పాఠకులు పేర్కొన్నారు.
“ఆంగ్లంలో కాని, మరే ఇతర ఐరోపా భాషలో కాని ‘యోగం’ గురించి ఇటువంటి చక్కటి వర్ణన ఇంతవరకు రాలేదు.”